ఏపీ రాజధాని పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu restarted AP capital works

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ మొదలైంది. తుళ్లూరు మండలం.. రాయపూడి దగ్గర రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. అక్కడి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) భవనానికి పూజలు చేశారు. ఆ తర్వాత భవనంలో కలియ తిరిగారు. అక్కడి అధికారులను రాజధాని నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారాయణ కూడా చంద్రబాబుతో ఉన్నారు.

CRDA ఆఫీసు పనుల ద్వారా ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైనట్లైంది. ఇక ఈరోజు నుంచి రాజధాని నిర్మాణం సాగుతుంది. CRDA భవనాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకూ నిధులు కేటాయించారు. ఏడు అంతస్థుల ఈ భవనంలో ఇదివరకు రాజధాని పనులు సాగేవి. 2017 నుంచి ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఐతే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఈ భవనంలో పనులకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఇందులో కొన్ని మరమ్మతుల వంటివి చేపట్టాల్సి ఉంది. అలాగే సరికొత్త మార్పులు చెయ్యాల్సి ఉంది. అవి పూర్తయ్యాక.. రాజధానిలో చేపట్టాల్సిన నిర్మాణాల పనులు మొదలవుతాయి.

సీఆర్డీయే ప్రధాన కార్యాలయం జీ ప్లస్ 7గా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.160 కోట్లు కేటాయించారు. సీఆర్డీయే, ఏడీసీ, మున్సిపల్ శాఖలోని అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు ఈ భవనంలోనే ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇక వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టేలా ప్లాన్ ఉంది. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలకు సంబంధించిన పనులు 2025 జనవరి కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Cambodia bans musical horns on vehicles to curb dangerous street dancing. Latest sport news.