Today CM Revanth Reddy to Charminar. Huge security arrangements

నేడు చార్మినార్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ బందోబస్తు ఏర్పాట్లు

హైదరాబాద్‌: ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఉదయం 10.30కి చార్మినార్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది సద్భావన అవార్డును మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సద్భావన యాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, డి.శ్రీధర్ బాబు, డి.సీతక్క, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌బహదూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్‌ ముగింపు వేడుకలకు హాజరు కానున్నారు. చార్మినార్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తుకున పోలీసులు చేరుకున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని సూచించారు. వేరే మార్గాల ద్వారా వాహనదారులు వెళ్ళాలని తెలిపారు. చార్మినార్ వద్ద షాపుల బంద్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. Hest blå tunge. 10 international destinations for summer travel : from relaxing beach getaways to bustling cities.