అబద్ధాలు ప్రచారం చేసి కూటమి ఎన్నికల్లో గెలిచిందని, ప్రజలు మోసపు మాటలను నమ్మి ఓట్లు వేశారని, రాష్ట్రాన్ని కూటమి నిండా ముంచేసిందన్నారు మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్. తాడేపల్లిలోని వైసీపీ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావొస్తుంది ..చంద్రబాబు పాలన గమనిస్తే కనిపిచ్చేది ఏమిటంటే..ఎక్కడా కూడా మచ్చుకైనా కూడా ఈ ప్రభుత్వ హయాంలో ..మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా డీబీటీ కనిపించదు. చంద్రబాబు హయాంలో కనిపించేది ఏంటంటే డీపీటీ..దోచుకో..పంచుకో..తినుకో..ఈ పాలన మాత్రమే ఈ ఐదు నెలలుగా కనిపిస్తోంది.
ఎక్కడా కూడా సూపర్ సిక్స్ లేదు..సూపన్ సెవెన్ లేదు. ప్రజలు నిలదీస్తారేమో అని భయపడి..కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్ధ ప్రభుత్వం ఇదే. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో నడుపుతున్న ప్రభుత్వం దేశంలో ఏది ఉండదేమో? ఇక్కడ మాత్రమే అలా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో దారుణంగా డీపీటీ పాలన సాగుతుందంటే..ఎక్కడ చూసినా ఇసుక దగ్గర నుంచి మొదలు మద్యం వరకు, పేకటా క్లబ్‌లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఎవరు మైనింగ్ యాక్టివిటి చేయాలనుకున్నా..ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే కప్పం కట్టాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత..రాష్ట్రవ్యాప్తంగా దోచుకో..పంచుకో..తినుకో పాలన సాగుతోందంటూ జగన్ విమర్శలు చేసారు.
రాష్ట్రంలో ఇసుక ఫ్రీ అంటూ కూటమి ప్రకటన.. ప్రకటన వరకే ఆగిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తే చాలు ఫ్రీ ఫ్రీ అంటూ ప్రకటించి, నేడు ఒక్కొక్క జిల్లాలో రూ.60 వేలు చొప్పున, మరికొన్ని జిల్లాలలో రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నారన్నారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని, సాక్షాత్తు చంద్రబాబు ఇంటి ప్రక్కనే ఇసుక అక్రమంగా త్రవ్వుతున్నట్లు ఆరోపించారు. ఇసుక రాష్ట్రానికి జీరో ఆదాయం వచ్చేలా చేసి, టీడీపీ నేతలే దండుకుంటున్నట్లు విమర్శించారు. రాష్ట్రంలో కమీషన్ ఇవ్వనిదే ఏ పనులు సాగడం లేదని, అంతా అవినీతిమయం అయిందంటూ జగన్ అన్నారు. ఇలా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ విమర్శలు చేశారు.