Pension for children whose parents are dead

శ్వేతపత్రాలపై ఏం చేశారు…? అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్

అధికారంలోకి వచ్చి రాగానే చంద్రబాబు ..గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పత్రాల్లో అనేక అంశాలను ప్రస్తావించి వీటిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అయితే రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అధికారులనుండి ఎలాంటి సమాచారం లేకపోవడం తో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్వేతపత్రాలపై తీసుకున్న చర్యలు, జరుగుతున్న విచారణలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

ఇదే క్రమంలో రాష్ట్రంలోని రోడ్ల విషయంలో గుడ్ న్యూస్ తెలిపారు. ప్రస్తుతం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకంపై ఫోకస్ పెట్టామన్న ఆయన.. రోడ్లను బాగు చేసే అంశాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి రోడ్ల మరమ్మతులు ప్రారంభం అవుతాయనీ, యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు జరుగుతాయని తెలిపారు.

సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా గుంతలు కనిపించడానికి వీల్లేదని అధికారులకు తెలిపారు చంద్రబాబు. ఆర్‌అండ్‌బీ (R&B) పరిధిలోని రహదారుల్లో గుంతలు పూడ్చడానికి రూ.600 కోట్లు ఇచ్చామన్న ఆయన.. అవసరమైతే మరో రూ.300 కోట్లు ఇస్తామన్నారు. అందువల్ల సంక్రాంతి నాటికి ఏపీ రోడ్లుబాగుపడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bring the outside in : 10 colorful indoor plants to add a pop of joy brilliant hub. , a bolt, and enameled copper wire to make a simple diy generator. Sports – mjm news.