ఏపీని వరుస వర్షాలు వదలడం లేదు..గత నాల్గు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతూ..ఈరోజు కాస్త తగ్గాయో లేదో..మరో వాన గండం ముంచుకొస్తుందనే వార్త ప్రజలను ఖంగారుపెడుతుంది. ఇప్పటికే వర్షాల దెబ్బకు పంటలన్నీ నాశనం అయ్యాయని భాదపడుతున్న రైతులకు..వరుస వాయు గుండాలు నిద్రకూడా పోనివ్వడం లేదు.
ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోనసీమ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపింది.