Suriya 44 | సమ్మర్‌కు రానున్న సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీ

suriyas looks in the karthik subbaraj film 1727535826

తమిళ స్టార్ హీరో సూర్య టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో సూర్య 44 అనే సినిమా రాబోతుంది ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అంచనాలు భారీగా ఉన్నాయి సూర్య కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలవబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది పూజా హెగ్డే తెలుగులో బుట్టబొమ్మ పేరుతో పాపులర్ అవడంతో ఈ చిత్రం మీద ఆసక్తి మరింత పెరిగింది సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ చిత్ర అనౌన్స్‌మెంట్ 2024 మార్చి 28న ఘనంగా ప్రారంభమైంది జూన్ 2న షూటింగ్ మొదలై అక్టోబర్ 6న షూటింగ్ పూర్తయిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొనగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇటీవలే సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ ఇతర టెక్నికల్ పనులపై ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా సజావుగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని 2025 వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని కార్తీక్ చెప్పారు మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనుండగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సంతోష్ నారాయణన్ బాధ్యతలో ఉంది సూర్య అభిమానులు ఈ ప్రాజెక్ట్ గురించి ఆతృతగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా సూర్యను మరో కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    But іѕ іt juѕt an асt ?. Latest sport news. レコメンド.