tj gnanavel

అలాంటి ఎన్‌కౌంటర్‌లు నన్ను కదిలించాయి : టి.జె. జ్ఞానవేల్

దర్శకుడు టి జె జ్ఞానవేల్ మాట్లాడుతూ వెట్టయన్ సినిమా నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందించాను కొన్ని ఎన్‌కౌంటర్ కేసులు,వాటిలో జరిగిన సంఘటనల నుంచి కథకు ఆలోచన వచ్చింది మానవ హక్కులు న్యాయ వ్యవస్థ చుట్టూ అల్లుకున్న కథను అత్యంత నిజాయితీగా చూపించాలని ప్రయత్నించాను అన్నారు టి జె జ్ఞానవేల్ జై భీమ్ వంటి సామాజిక సందేశమున్న చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి చేసిన చిత్రం వెట్టయన్ ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్ ఫహాద్ ఫాసిల్ రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రజనీకాంత్ గారిని ఓ కథానాయకుడిగా మాత్రమే కాకుండా సామాజిక అంశాలను చర్చించడానికి కూడా ఉపయోగించుకోవాలని అనుకున్నాను ఈ కథలో ఎన్నో అంశాలు ఉన్నాయి అయితే రజనీకాంత్ అభిమానులు కోరుకునే ఆ ఐకానిక్ మూమెంట్స్ కూడా జోడించాం ఈ కథకు రజనీకాంత్ గారి స్టైల్ మ్యానరిజంను సరైన మోతాదులో పొందుపరచడం సవాలుగా ఉంది అని దర్శకుడు అన్నారు.

సూపర్‌స్టార్లను సమతుల్యం చేయడం కంటే వారి పాత్రల భావజాలాలను సమతుల్యం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను అమితాబ్ బచ్చన్ పాత్రకు ప్రారంభంలోనే సాలీదైన పరిచయం ఇచ్చాను ఆ పాత్ర ద్వారా న్యాయవిధానం విలువల గురించి చూపించాను రజనీకాంత్ పాత్ర మాత్రం చాలా తటస్థంగా ఉండేలా మొదలు పెట్టాను. మధ్యలో వారు ప్రతిభావాల్ల మధ్య ఉన్న విభేదాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపిస్తాయి అని అన్నారు
దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఎన్‌కౌంటర్ ఘటనలు చదివాను వీటి వెనుక వాస్తవం ఏమిటి ఎన్‌కౌంటర్లు సరైనవా అనే ప్రశ్నలు మదిలో మెదిలాయి ఎర్రచందనం స్మగ్లర్ల ఘటనలు చూస్తే కొన్నిసార్లు అమాయకులు కూడా ఈ ఎన్‌కౌంటర్లలో బాధితులవుతున్నారు ఈ సంఘటనలు నన్ను కదిలించాయి దాని చుట్టూ కథను అల్లే ప్రయత్నం చేశాను అని వివరించారు జన గణ మన చూశాను కానీ నా కథ సరిగా వేరే కోణం నుండి ఉంటుంది నా ఉద్దేశం ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ల జీవితాలను వారి వృత్తి సంక్లిష్టతలను ప్రదర్శించడం నేను వ్యక్తిగతంగా గౌరవించే ప్రొఫెషనల్‌గా ఉన్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌లను పరిశీలించి వారి జీవనశైలిని తీసుకుని కథ రాశాను అన్నారు కమర్షియల్ అంశాలను సీరియస్ కథతో సమతుల్యం చేయడం చాలా కష్టమైన పని కానీ వెట్టయన్ రజనీకాంత్ అభిమానులకు కావలసిన వినోదం ఆలోచింపజేసే కథా సారం ఇస్తుంది నేను న్యాయ ప్రక్రియపై రాజ్యాంగ శక్తిపై గట్టి నమ్మకం ఉంచాను అదే ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది రజనీకాంత్ గారికి కావలసిన యాక్షన్ సీక్వెన్స్‌లు కథనంలో అంతర్లీనంగా ఉంటాయి అని చెప్పారు.

ఫహాద్ ఫాసిల్ పాత్రకు కీలకమైన భావోద్వేగం కావాలి అందుకే అతనిని ఎంపిక చేశాను అతను నటించిన పాత్ర కథలో చాలా ప్రధానమైనది అతని ప్రదర్శన సినిమాకు ఓ కొత్త ఎత్తును తీసుకువచ్చింది అని వివరించారు సీక్వెల్ కన్నా ప్రీక్వెల్‌పై ఎక్కువ ఆసక్తి ఉంది వెట్టయన్ కథలో ఉన్న కొన్ని పరిణామాలకు ముందుగా జరిగిన సంఘటనలను చూపిస్తూ మరో ఆసక్తికరమైన కథ చెబాలని భావిస్తున్నాను అని దర్శకుడు చెప్పుకొచ్చారు ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి కానీ వెట్టయన్’పై పూర్తిగా దృష్టి పెట్టాను నవంబర్ ప్రారంభంలోనే నా కొత్త ప్రాజెక్ట్‌ల గురించి చెప్పబోతున్నాను అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Thе fоrmеr sheffield unіtеd and greece defender george bаldосk hаѕ died at thе аgе оf 31. Stuart broad archives | swiftsportx.