sajjala

నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న సజ్జల..

అమరావతి: వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఈరోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో సాయంత్రం 4 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు సజ్జల రానున్నారు. దాడి ఘటనలో ప్రమేయం ఉన్న ముఖ్య నాయకులను విచారించే క్రమంలో సజ్జలకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను విచారించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు మరికొందరు వైసీపీ నేతలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఘటన వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌లను పలుమార్లు విచారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Com – gaza news. Latest sport news.