ramcharan

Ramcharan: రామ్‌చ‌ర‌ణ్ గొప్ప మ‌న‌సు.. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారికి సాయం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం చేసి తన సానుభూతిని వ్యక్తం చేశారు పుట్టుకతోనే పుల్మనరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతూ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న చిన్నారికి 53 రోజులపాటు వైద్య సహాయం అందించారుహైదరాబాద్‌కు చెందిన ఓ ఫోటో జర్నలిస్టు దంపతులకు ఆగస్టు 22న పాప పుట్టింది. అయితే ఆ పాప గుండె సమస్యతో పుట్టడం వల్ల తక్షణమే వైద్య సహాయం అందించకపోతే బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు తల్లిదండ్రులు అనివార్యంగా తమ చిన్నారిని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అక్కడి వైద్య ఖర్చులు లక్షల్లో ఉండటంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్న తండ్రి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

ఈ వార్త రామ్ చరణ్‌కి తెలిసిన వెంటనే ఆ చిన్నారి కోసం 53 రోజులపాటు వైద్య ఖర్చులను భరిస్తూ సహాయం అందించారు అంతేకాక చికిత్సలో భాగంగా అవసరమైన ప్లేట్‌లెట్లు, రక్తం వంటి కీలక అంశాలను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అందించారు. చిన్నారికి సమయానికి మెరుగైన వైద్యం అందడంతో ఆమె ఆరోగ్యం కుదుటపడి బుధవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేయబడ్డారుఈ విషయం మెగా అభిమానులలోకి చేరడంతో రామ్ చరణ్ రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. But іѕ іt juѕt an асt ?. Lankan t20 league.