Pawan Kalyan anger over the demolition of Muthyalamma statue in Secunderabad

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ద్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్ర‌హం

హైదరాబాద్‌: ఈ నెల 13 ఆదివారం అర్దరాత్రి సమయంలోతెలంగాణలో జరిగిన అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం దుర్మార్గం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహాపచారం అని అన్నారు.

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానని జ‌న‌సేనాని పేర్కొన్నారు. ఇటీవ‌లి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ దేవాల‌యాల‌ను అప‌వ్రితం చేయ‌డం అల‌వాటుగా మారింది. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమన్నారు.

అందుకే తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో చెప్పానని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు జ‌న‌సేనాని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు.

కాగా, సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. విగ్రహం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీసింది. హిందూత్వ సంఘాలు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంఘటనలో కొందరిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Cost analysis : is the easy diy power plan worth it ?. Latest sport news.