అలాంటి అపోహలే పెట్టుకోవద్దు – సీఎం రేవంత్

వికారాబాద్ దామగుండం ఫారెస్టులో ప్రారంభించబోయే ‘వీఎల్ఎఫ్’ రాడార్ స్టేషన్ ప్రాజెక్టుపై అపోహలొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు మరింత గౌరవం తీసుకొస్తుందని , దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు.

వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో దామగుండం ఫారెస్ట్ లో విఎల్ఎఫ్ స్టేషన్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు వేయబోతోంది అన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా నేను, స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే విఎల్ఎఫ్ స్టేషన్ ప్రారంభించు కోవడం గర్వకారణం అన్నారు.

విఎల్ఎఫ్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. దీనివల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడుతుందని, స్థానిక ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతోనే ఇక్కడ దేశంలోనే రెండవ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దేశ భద్రత విషయంలో నేవి కీలక పాత్ర పోషిస్తుందని.. ఇక్కడి రాడార్ స్టేషన్ నిర్మాణం ద్వారా సబ్ మెరైన్ లతో కమ్యూనికేషన్ బలపడుతుందన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు తగదని, సీఎం రేవంత్ రెడ్డి అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది అంటూ.. సీఎంకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?ை?. 大自?. Ihr dirk bachhausen.