devara 11 day

దేవర సక్సెస్..ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఏ తరుణంలో ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.“దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది.

నా సహ నటులు సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, తదితర నటీనటులకు ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి మా కథకు జీవం ఇచ్చారు. నా దర్శకుడు కొరటాల శివగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయింది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించారు. రత్నవేలు సర్ సినిమాటోగ్రఫీ, సాబ్ సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ తో అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు.

మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు, థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. మీరు చూపించే ప్రేమ, అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎల్లప్పుడూ గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. దేవర చిత్రాన్ని మీ భుజాల పై మోసి ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్ నోట్ రాసారు.

ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. But іѕ іt juѕt an асt ?. Retirement from test cricket.