కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతుంది: కేటీఆర్‌

ktr comments on telangana government

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని అన్నారు. విద్యుత్‌ సరఫరాకు గ్యారంటే లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే చార్జీలు పెంచి జనంపై భారం మోపేందుకు రెడీ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క గ్యారంటీ సరిగ్గా అమలు చేసిందన్నారు. ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేనని ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే?. మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *