ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈరోజు మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 చోట్ల షాపులకు ఒక్కోటి చొప్పున, 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులను రద్దుచేసి ప్రైవేట్ వారికి మద్యం షాపుల లైసెన్సులు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ను ఏపీ సర్కార్ జారీచేసింది.