తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కోర్టు షాకిచ్చింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. నాగచైతన్య , సమంతల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై 8వ తేదీన స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ధర్మాసనం ఆమెకు నోటీసులు జారీ చేయడం జరిగింది.
Vaartha: Breaking News, Insights & Updates: Stay Informed with Vaartha Magazine"
Stay Informed, Stay Ahead – Your Trusted Source for Breaking News