Nara Lokesh Sensational Comments ON YS Jagan

జగన్ పాలనలో వెలువడిన చీకటి జీవోలుకాదు కూటమి ప్రభుత్వానివి: లోకేశ్‌

అమరావతి: ఇకనైనా జగన్‌ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ”వరద బాధితులకు ఇస్తామన్న రూ.కోటిలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్. ఒక వాటర్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా పంపిణీ చేయని ఆయన.. వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నారు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు. వీటికి ఖర్చు రూ.23 లక్షలు కూడా కాలేదు.

జగన్ పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి. మా ప్రభుత్వం లెక్కలు అన్నీ పారదర్శకంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టాం. చదువు వస్తే చదువుకో.. కళ్లుంటే చూడు. తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కుని ఎగ్‌ పఫ్‌ల పేరుతో జగన్‌ ప్రజాధనం రూ.కోట్లు మెక్కారు. ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు” అని లోకేశ్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Thаt both kane аnd englаnd wоuld bе bеttеr off іf hе retired frоm international fооtbаll. Latest sport news.