bullet train

ఏపీకి బుల్లెట్ ట్రైన్.. ?

ఏపీలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతోందా..? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలన్నది సీఎం చంద్రబాబు డ్రీమ్. పదేళ్ల నాటి కల ఆయనది. ఇందుకోసం 2014లో ఆయన ప్లాన్ చేశారు. అప్పట్లో సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని నిర్ణయించు కున్నారు. ఆలోచన చేశారు కానీ, కార్యరూపం దాల్చలేదు. కాకపోతే బుల్లెట్ ట్రైన్ అనేది సీఎం ఆలోచనలో అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది టీడీపీ. ఈ క్రమంలో తన కలల డ్రీమ్‌ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు.

రెండురోజుల కిందట ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. పనిలో పనిగా తన బుల్లెట్ ప్లాన్‌ను మోడీ ముందు పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాని నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, బుల్లెట్ ట్రైన్ విషయాన్ని రివీల్ చేశారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు సిటీలను కలుపుతూ బుల్లెట్ రైలు రానుందని వెల్లడించారు. చంద్రబాబు స్వయంగా చెప్పడం తో రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Com – jakarta | hadiri pelantikan pemuda katolik pengurus pusat, wakil presiden ri gibran rakabuming raka menyampaikan. Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. Latest sport news.