gold price

భారీగా పడిపోయిన గోల్డ్ రేట్

పండగవేళ బంగారం ధరలు దిగివస్తుండడం అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ సెషన్ తర్వాత బాగా తగ్గిన బంగారం ధరలు.. గత కొన్ని రోజులుగా పైపైకి పోతూ మళ్ళీ భగ్గుమంటున్నాయి. క్రమంగా గోల్డ్ రేట్లు ఆల్ టైం హైకి చేరుకోవడంతో జనం అయోమయంలో పడ్డారు. గత వారం రోజుల్లో చూస్తే గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ మార్పు కనిపించింది. అయితే ఈ రోజు మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గాయి. పండగ సమయంలో బంగారం కొనాలనుకునే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం.

మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.77,880 ఉండగా, బుధవారం నాటికి రూ.710 తగ్గి రూ.77,170కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.93,010 ఉండగా, బుధవారం నాటికి రూ.500 పెరిగి రూ.90,510కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,350గా ఉంది. మేలిమి బంగారం ధర రూ. 77,100గా ఉంది. వెండి ధర మాత్రం పెరిగింది. గత 10 రోజుల నుంచి పెరుగుతూ వస్తోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97 వేలు ఉంది.

హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ.10 తగ్గి రూ.70,990 వద్ద ఉంది. 24 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 77,440 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదే విధంగా ధరలు ఉన్నాయి. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,170గా ఉంది. కిలో వెండి ధర రూ.90,510గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,170గా ఉంది. కిలో వెండి ధర రూ.90,510గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,170గా ఉంది. కిలో వెండి ధర రూ.90,510గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. Latest sport news.