rajinikanth vettaiyan

‘వేట్టయాన్‌’ రిలీజ్ సందర్బంగా ఆఫీస్ లకు సెలవు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వయసును సైతం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక రజని నుండి సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు పెద్ద పండగ. రిలీజ్ రోజు ఎన్ని పనులు ఉన్న వాటిని పక్కన పెట్టి సినిమా చూస్తారు. ఇక ఇప్పుడు రజనీకాంత్ నుండి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్‌’. సూర్యతో జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రజినీ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో ఆఫీసులకు హాలిడే ఇవ్వడం ఎప్పటినుండో సంప్రదాయంగా వస్తోంది, గతంలో సూపర్ స్టార్ నటించిన రోబో, శివాజీ, కబాలి రిలీజ్ టీమ్ లో చెన్నైలోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగస్తులకు హాలిడే ప్రకటించాయి. ఇక ఇప్పుడు ‘వేట్టయాన్‌’ విషయంలోనూ అదే జరుగుతుంది. మద్రాసు లో ఈ మూవీ 656 షోస్ ( All Time Record) రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా కొన్ని కంపెనీలు హాలిడే ప్రకటిస్తూ లెటర్ రిలీజ్ చేసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pemuda katolik komda kepri gelar seminar ai, membangun masa depan dengan teknologi canggih. Un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Latest sport news.