vijayasai reddy Tweet to CB

చంద్రబాబు నైజం ఇదే – విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. ‘సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే మనకేంటి, పెరగకపోతే మనకేంటి. మరో నాలుగేళ్ల తర్వాత ప్రజలకి దొంగ హామీలిచ్చి, మభ్య పెట్టి, మోసగించి ఓట్లు వేయించుకోవచ్చు. మనకి కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం. కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాచుకోవడమే ఆయన నైజం’ అని ట్వీట్ చేశారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు రెండు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుండ‌టంపై విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. ఎక్స్ వేదిక‌గా కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని విజ‌య‌సాయిరెడ్డి ఎండగట్టారు. జీతాలు ఎప్పుడిస్తారంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

చంద్రబాబు @ncbn నైజం …
సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి…
నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే మనకేంటి, పెరగకపోతే మనకేంటి…
టమాటా 100 అయితే మనకేంటి, 200 అయితే మనకేంటి…
ఇసుక టన్ను 2000 అయితే మనకేం, 4000 అయితే మనకేంటి…
మరో 4 సంవత్సరాల తర్వాత ప్రజలకి దొంగహామీలిచ్చి,…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Asn kemenkumham penugasan bp batam ikuti pembinaan. Com – gaza news. Latest sport news.