ysrcp mp nandigam suresh satirical comments on pawan kalyan jpg

మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే మాజీ ఎంపీ సురేష్‌పై ఉన్న హత్య కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. తుళ్ళూరు పోలీసులు వేసిన పీటీ వారెంట్‌కు ట్రయల్ కోర్టు అనుమతించింది.

టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గత నెలలో నందిగం సురేష్‌ హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు సురేష్‌ను పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కీలక సమాచారాన్ని ఆయన నుంచి రాబట్టారు. రెండు వారాల జ్యుడీషియల్‌ రిమాండ్‌ ముగియడంతో మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్నటి(గురువారం)తో రిమాండ్ ముగియడంతో మరోసారి మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది.

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. “the most rewarding aspect of building a diy generator is seeing the. Latest sport news.