ntr nxt movie

నెల్సన్ కథకు ఓకే చెప్పిన జూ.ఎన్టీఆర్..?

‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జూ.ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించే అవకాశం కన్పిస్తోంది. ఇటీవల దర్శకుడు చెప్పిన కథకు యంగ్ టైగర్ ఓకే చెప్పారని సమాచారం. వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాల తర్వాతే ఇది పట్టాలెక్కనుందని టాక్.

తాజాగా ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఏడు రోజులకు రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో డ్రాగన్ షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైన్ అప్ లోకి చాలా మంది దర్శకులు వస్తున్నారు. ఇప్పటికే వెట్రిమారన్ తో సినిమా ఉంటుందని ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేశారు. వెట్రిమారన్ కూడా దీనిని ధృవీకరించారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో కోలీవుడ్ దర్శకుడితో మూవీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నెల్సన్ దిలీప్ త్వరలో ఎన్టీఆర్ కి కథ చెప్పబోతున్నాడంట. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో నెల్సన్ దిలీప్ ఈ మూవీ చేయడానికి సిద్ధం ఆవుతోన్నట్లు తెలుస్తోంది.

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Whаt wіll іt tаkе tо turn the tіdе ?. Lankan t20 league.