బాసరలోని RGUKT (Rajiv Gandhi University of Knowledge Technologies) కి అనుబంధంగా మరో రెండు IIITలను ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
ఒకటి ఉమ్మడి మహబూబ్ నగర్, మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేయొచ్చని సమాచారం. ఒక్కోదానికి 100 ఎకరాల భూమి, రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇంజినీరింగ్ తో పాటు మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.