రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ సీఎం రేవంత్ ఫై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. . ‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం కు తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రైతన్నలు రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.
మరో 67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతుబంధు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తి రైతులు దళారుల చేతిలో దగాపడి అల్లాడుతున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక పాలనతో ప్రజలకు దసరా.. దసరాలా లేదు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.