ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు … 13 మంది రోజువారీ కూలీలు భదోహ జిల్లాలో పని ముగించుకొని తిరిగి వారణిసి వైపు వెళుతుండగా, నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కచ్వా సరిహద్దు జిట్ రోడ్ లో ప్రమాదం జరిగింది.
ఓ ట్రక్కు అదుపుతప్పి ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.మరో ముగ్గురు కూలీలు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన కూలీలను వెంటనే బనారస్ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.