hostel

హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు — రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

*హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు — రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

  • రాంపురం గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరా
  • డిశ్చార్జి చేసినా హాస్టల్ లో వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే ఉంచాలని మంత్రి ఆదేశం

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోకి బయట ఆహారాన్ని తీసుకుకరానివ్వొద్దని బీసీ సంక్షేమ శాఖాధికారుల, హాస్టల్ సిబ్బందిని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 13 మంది బాలికలు స్వల్ప అసస్థతకు గురయ్యారు. రాంపురం ప్రాథమిక వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం మంగళవారం ఉదయం వారిని డిశ్చార్జి చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత…విద్యార్థినులతోనూ, వైద్యులతోనూ, గురుకుల సిబ్బందితోనూ ఫోన్లో మాట్లాడారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని మంత్రితో వైద్యులు తెలిపారు. విద్యార్థినులంతా కోలుకున్నారని, వారిని డిశ్చార్జి చేశామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం హాస్టల్ లోనే విద్యార్థినులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు గురుకుల సిబ్బంది తెలిపారు. బాలికలను డిశ్చార్జి చేసినా హాస్టల్ లోనే వైద్యుల పర్యవేక్షలోనే ఉంచాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి నివేదికలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. గురుకుల పాఠశాలల మిగిలిన విద్యార్థినుల పరిస్థితిపైనా మంత్రి ఆరా తీశారు. వారంతా బాగున్నారని, ఆదివారం కావడంతో, హాస్టల్ చుట్టు పక్కల ఉన్న షాపుల నుంచి కూడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసి విద్యార్థినులు తిన్నారని తెలిపారు. అటువంటి వారే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. దీనిపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం చేశారు. హాస్టల్ లోకి బయట ఆహారం తీసుకురానివ్వొదని ఆదేశించారు. విద్యార్థినులను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్ నుంచి బయటకు వెళ్లనీయొద్దని మంత్రి సవిత ఆదేశించారు.

Related Posts
యథాతథంగానే రెపో రేటు..
rbi announces monetary policy decisions

న్యూఢిల్లీ: కీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారంతో ముగిసిన మూడు రోజుల Read more

హైదరాబాద్‌లో తమ ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు (ఐఏబి)ని ప్రారంభించిన యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్)
University of East London UEL has launched its Industry Advisory Board IAB in Hyderabad

ఆవిష్కరణ మరియు పరిశ్రమ భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇండియా టూర్ 2024ను మరింతగా విస్తరించింది. హైదరాబాద్: తమ కొనసాగుతున్న ఇండియా టూర్ 2024లో భాగంగా, యూనివర్శిటీ ఆఫ్ Read more

కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి క్యాంపస్ అవార్డు
KL Deemed to be University wins All India Smart Campus Award at NECA 2024

న్యూఢిల్లీ : బిఇఇ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (ఎన్ఈసిఏ -2024) వద్ద "ఇన్నోవేషన్ అవార్డ్ ఫర్ ప్రొఫెషనల్" విభాగంలో ప్రతిష్టాత్మక ఆల్-ఇండియా స్మార్ట్ క్యాంపస్ అవార్డుతో Read more

gautam adani :హైకోర్టు లో అదానీకి భారీ ఊరట
హైకోర్టు లో అదానీకి భారీ ఊరట

ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అదానీలకు బొంబాయి హైకోర్టు సోమవారం భారీ ఊరటనిచ్చింది. దాదాపు ₹388 కోట్ల మార్కెట్ Read more