మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన నటన పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంటోంది సహజమైన నటన అందమైన హావభావాలతో ప్రతి పాత్రలో జీవించడం ఆయన ప్రత్యేకత లేటుగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు సినిమాల్లో హీరోగా నటిస్తూ మరోవైపు విలన్ పాత్రల్లోనూ తనదైన ముద్రవేస్తున్నాడు తెలుగు తమిళ్ హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ఇటీవల మహారాజ అనే చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు ఆయన విలన్‌గా నటించిన విక్రమ్ సినిమా విశేషమైన విజయం సాధించింది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ సూర్య వంటి తారలు ముఖ్యపాత్రల్లో కనిపించారు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో ఆకట్టుకోవడమే కాకుండా సినిమాలోని తన అద్భుతమైన డైలాగ్స్ ద్వారా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి భార్యగా నటించిన నటిని గుర్తుపట్టారా ఆమె పేరు మహేశ్వరి చాణక్యన్ తమిళ్ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందగత్తె, వీజేగా తన కెరీర్ ప్రారంభించి కొన్ని ప్రముఖ చిత్రాల్లో నటించింది మహేశ్వరి చాణక్యన్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలను పోస్టులను తరచూ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది ముఖ్యంగా విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన క్యూట్ లుక్స్ గ్రేస్‌ఫుల్ ప్రెజెన్స్‌తో సినీ అభిమానులను అలరించింది అంతేకాదు ఆమె తమిళ్ బిగ్ బాస్‌లో కూడా పాల్గొని తన పాపులారిటీని మరింత పెంచుకుంది మహేశ్వరి చాణక్యన్ తరచుగా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది ఈ అమ్మడి అందాలను చూసి కుర్రకారు గూగుల్‌లో ఆమె గురించి వెతుకుతుండటంతో మహేశ్వరి చాణక్యన్కు ఆన్లైన్లో విపరీతమైన పాపులారిటీ పెరిగింది.