విశాఖకు లలిత్ బోహ్రా.
గుంటూరుకు ఆనంద్ మధురర్
-గుంతకల్లుకు చంద్రశేఖర్ గుప్తా
గుంతకల్లు: రాష్ట్రoలోని వాల్తేరు, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లతో పాటు దేశవ్యాప్తంగా ఇరవై మూడు రైల్వే డివిజన్లకు మేనేజర్లు నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని వాల్తేరు డివిజన్ డిఆర్ఎంగా లలిత్ బొహా, గుంటూరు డిఆర్ఎంగా అనంద్ మధుకర్, గుంతకల్లు డిఆర్ ఎం చంద్రశేఖర్ గుప్తాలను నియమించారు. అలాగే వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని కోట డిఆర్ఎంగా అనిల్ కల్రా, జబల్పూర్ కమల్ కుమార్, నార్త్ వెస్ట్రన్ రైల్వే అజ్మీర్ డివిజన్ కు రాజు భుట్రా, పశ్చిమ రైల్వే రాట్లం – అశ్వినీ కుమార్ నైరుతి రైల్వే హుబ్లీ డివిజను బెలమీనా, బెంగళూరు డివిజన్ కు అమితేష్ కుమార్ సిన్హా, సెంట్రల్ రైల్వే ముంబై-హిరేష్ మీనా, అంబాలా డివిజన్- వినోద్ వాటియా. రాయపూర్- కోగంటి సాంబశివరావు, లమ్మింగ్ డిఆర్ఎంగా సమీర్ లోహానిని, మల్దా – మనీష్ కుమార్ గుప్తా పశ్చిమ రైల్వే ముంబై డిఆర్ఎంగా పంకజ్ సింగ్, చక్రధర్ పూర్ కు తరుణ్ హరియ, లకనౌ గౌరవ్ అగర్వాల్, షోలాపూరు సుజిత్ మిశ్రా, ఇజ్జత్ నగర్ వీణా సిన్హా, సెంట్రల్ నాగపూర్- వినాయక్ గార్గ్ బిలాస్ పూర్-రాజ్ కమల్ బోయి.
పూణే- రాజేష్ కుమార్ వర్మ, సౌత్ ఈస్ట్ సెంట్రర్ రైల్వే నాగ్పూర్-దీపక్ కుమార్ గుప్తాలు ఆర్ఎంలుగా నియమించారు