KTR

రుణమాఫీ నిరూపిస్తే రాజకీయ సన్యాసం : కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ (శనివారం) ‘రైతు భరోసా’ అంశంపై ఇవాళ చర్చ కొనసాగుతోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ సవాలు విసిరారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా పూర్తయిందని నిరూపిస్తూ రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాలు విసిరారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని ఆయన ప్రకటించారు.
రైతులను నిండా ముంచారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇతర పెద్దలకు కేటీఆర్ ఈ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదని, రెండు పంటల సాయాన్ని ఎగ్గొట్టారని మాజీ మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రతి రైతుకి రూ.17వేలు బాకీ పడ్డారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కలిపి రూ.26 వేల కోట్ల మేర బాకీ పడ్డారని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.
24 గంటల విద్యుత్ నిరూపిస్తారా?
కాంగ్రెస్‌ పాలనలో 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సభను వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దామని, 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుందని కేటీఆర్ సవాలు విసిరారు.
హామీలను నిలబెట్టుకోవాలి
రైతుల బకాయిలను చెల్లించి కొత్తగా రైతు భరోసాను అందివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను పది రోజులపాటు పొడిగించాలని స్పీకర్‌ను ఆయన కోరారు. విద్యుత్, నీటి పారుదల, మిషన్‌ భగీరథ అంశాలపై చర్చ చేపట్టాలని అన్నారు.

Related Posts
తెలంగాణ లోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్?
wine shops telangana

తెలంగాణలో మద్యం ప్రియులకు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే దీనిపై చర్యలు Read more

Hyderabad: ఆ ఉద్యోగ సంతోషం ఒక్కరోజైనా గడవలేదు ఇంతలో ఆవరించిన ప్రమాదం
Hyderabad: ఉద్యోగం వచ్చిన ఆనందం ఒక్క రోజైనా నిలవలేదు.. ఘోర ప్రమాదం!

విధి ఎంత క్రూరమో, ఎంత అనిశ్చితమో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఎంతో ఉత్సాహంగా, ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరిన ఒక యువ ఇంజనీర్‌ తొలి రోజే Read more

Assembly: అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం
అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం అప్పులపై జరిగిన చర్చ Read more

జగిత్యాల ఆసుపత్రిలో నర్సుల క్రిస్మస్ వేడుకలు కలకలం
Nurses' Christmas celebrati

జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నర్సులు, సిబ్బంది క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ రోగులను గాలికి వదిలేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం ఈ సంఘటన Read more