space

భూమికి సమీపంలో రెండు గ్రహశకలాల ప్రయాణం

అంతరిక్షంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భూమికి సమీపం నుంచి రెండు గ్రహశకలాలు దూసుకుపోనున్నట్లు నాసా తెలిపింది.
ఇవాళ (సోమవారం) రెండు భారీ గ్రహశకలాలు భూమికి సమీపం నుంచి ప్రయాణించనున్నాయి.
ఒకదాని పేరు ‘2024 ఎక్స్‌వై5’ కాగా, రెండవది ‘2024 ఎక్స్‌బీ6’ అని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్ధారించింది. ఈ రెండు డిసెంబర్ 16న భూమి వైపు దూసుకురానున్నాయని తెలిపింది. అయితే, భూమికి ఎలాంటి ముప్పులేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహశకలాల ట్రాకింగ్, అప్రమత్తత విషయంలో అవగాహన పొందవచ్చని వివరించారు.
గ్రహశకలం ప్రయాణం ఇలా..
భూమి సమీపానికి రానున్న రెండు గ్రహశకలాల్లో ఒకటైన ‘2024 ఎక్స్‌వై5’ పరిమాణం 71 అడుగుల వెడల్పు ఉంది. గంటకు 10,805 మైళ్ల వేగంతో వెళ్లే ఈ గ్రహ శకలం, భూమికి దాదాపు 2,180,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. చంద్రుడి దూరం కంటే 16 రెట్లు ఎక్కువ దూరం నుంచి ఈ గ్రహశకలం వెళ్లనుంది.
ఇక ‘2024 ఎక్స్‌వై’ కంటే ‘2024 ఎక్స్‌బీ6’ గ్రహశకలం కొంచెం చిన్నది. దీని వ్యాసం 56 అడుగులుగా ఉంది. గంటకు 14,780 మైళ్ల వేగంతో భూమికి దాదాపు 4,150,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుందని నాసా తెలిపింది. ఇలాంటి గ్రహశకలాలు సౌర వ్యవస్థ ఆరంభానికి సంబంధించినవని, ఇవి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి గ్రహశకలాలను అధ్యయనం చేస్తే భూమి మూలాలు, విశ్వం చరిత్రకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని నాసా శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, భూమికి సమీపంలో ఉన్న వస్తువులను పర్యవేక్షించడానికి అధునాతన వ్యవస్థలను నాసా ఉపయోగిస్తుంది.

Related Posts
మల్లన్న వ్యాఖ్యలకు సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని మధుయాష్కీ డిమాండ్
madhu

తెలంగాణలో కులగణన అంశం మరోసారి రాజకీయం రేపుతోంది. తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కులగణనపై Read more

సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
11

హైదరాబాద్‌: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించే సీఎంఆర్‌ బకాయిల గడువు తేదీని మరో 3 నెలల Read more

నేడు సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న ఒమ‌ర్ అబ్దుల్లా..
Omar Abdullah will take oath as CM today

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా ఈరోజు ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీన‌గ‌ర్‌లో ఉన్న షేర్ యే క‌శ్మీర్ ఇంట‌ర్నేష‌న‌ల్ Read more

ఎల్ఆర్ఎస్‌పై హరీష్ రావు తీవ్ర ఆరోపణలు
ఎల్ఆర్ఎస్ పై హరీష్ రావు తీవ్ర ఆరోపణలు

ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ, సమాజంలోని కీలక వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు విమర్శించారు. ఎల్ఆర్ఎఎస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *