yanamala rama krishnudu comments on ys jagan

భ‌విష్య‌త్తులో జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డమ‌నేది ప‌గ‌టి క‌లే: యనమల

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణ మరోసారి మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శులు గుప్పించారు. తల్లి, చెల్లిపై కేసులు నమోదు చేయడంతో, జగన్‌ పాతాళంలో పడిపోయారని విమర్శించారు. ఆయనతో కలిసి ఉన్న వారందరూ కూడా పాతాళంలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. చివరకు, జగన తన స్వంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని ఆరోపించారు.

ఇది ఆస్తుల వివాదం కాదు, ఇది రాజకీయ ఆత్మహత్య అని యనమల పేర్కొన్నారు. షర్మిలకు రూ.200 కోట్లిచ్చానని జగన చెబుతున్నా… ఐటీ, ఈడీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసలు ఈ రూ.200 కోట్ల సొమ్ము ఆయనకు ఎక్కడి నుంచి వచ్చినట్లు అడిగారు. ఈ సందర్భంలో, జగనపై యనమల ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.

ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఎలా ఉన్నాడో అని ప్రశ్నించారు. భవిష్యత్తులో జగన మళ్లీ అధికారంలోకి రాయడం అసాధ్యమని చురకలంటించారు. పాత కేసులకు తోడు కొత్త కేసులు కూడా ఆయనపై సిద్ధంగా ఉన్నాయని, ఇవాళ కాకపోతే రేపు జగన జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు.

Related Posts
సంక్రాంతికి సొంతవూర్లకు వెళ్లేవారికి తీపి కబురు
APSRTC Good News

సంక్రాంతి పండుగ సందర్బంగా తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి Read more

మల్కాజ్‌గిరిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
Telangana Talli Statue at B

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో గండిమైసమ్మ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మరియు ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. Read more

హైదరాబాద్ లో పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్
హైదరాబాద్ లో పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్

స్కార్లెట్ జ్వరం అనేది గ్రూప్ ఎ స్ట్రెప్టోకోకస్ వల్ల పిల్లలలో కలిగే కాలానుగుణ బ్యాక్టీరియా సంక్రమణ, మరియు దీనికి నిర్దిష్ట యాంటీబయాటిక్స్తో చికిత్స చేయవచ్చు. పిల్లలు బ్యాక్టీరియాకు Read more

ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్‌
ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్‌

ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ ఫొటోలను తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *