అల్లరి నరేష్, ఒకప్పుడు గ్యారెంటీ హీరోగా తన విజయాల పర్యటన సాగించినా, గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు కొంత సమయం ఒడిదొడుకులతో గడిచింది. నాంది సినిమాలో సీరియస్ పాత్రలో నటించి హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఆ తర్వాత అదే దారిలో చేసిన చిత్రం బచ్చల మల్లి ప్రేక్షకులను నిరాశపరచింది. ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్‌లు, టీజర్‌లు భారీ అంచనాలు పెంచినప్పటికీ, సినిమా తీవ్రంగా విఫలమైంది. హీరో పాత్ర డిజైన్ బాగోలేదని, కథ, స్క్రీన్‌ప్లేపై వచ్చిన విమర్శలు బచ్చల మల్లి సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రిస్పాన్స్‌ను తెచ్చుకోలేకపోయాయి.

డిసెంబర్ 20న ₹5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమాకు ₹3 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ విధంగా ₹2 కోట్ల నష్టంతో సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. సంక్రాంతి సీజన్‌లో మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపధ్యంలో బచ్చల మల్కి థియేటర్స్‌లో నిలబడే అవకాశం లేకపోవడంతో, సినిమా త్వరగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు రాబోతుందని వార్తలు వినిపించాయి. ప్రారంభంలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 16 లేదా 17వ తేదీల్లో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, థియేటరల్ రన్ తొలగించబడిన వెంటనే ఈ సినిమా వారం ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం ఎక్కువ సినిమాలు, పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల సినిమాలు అన్ని ఓటీటీలో నాలుగు వారాల తరువాత స్ట్రీమింగ్ అవుతున్న తరుణంలో బచ్చల మల్లి కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తూ జనవరి 9న స్ట్రీమింగ్ కావచ్చు.అమోజన్ ప్రైమ్ నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.బచ్చల మల్లి సినిమాలో అల్లరి నరేష్ జోడీగా హనుమాన్ సినిమా ఫేం అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించారు.రావు రమేష్, సాయి కుమార్, హరితేజ ప్రధాన పాత్రల్లో నటించారు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వచ్చింది.