బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన.. ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కాళీ మాత కిరీటం చోరీ

ANI 20241010192116

బంగ్లాదేశ్‌లో ఇటీవల సంచలనకర ఘటన వెలుగుచూసింది, సత్‌ఖిరా జిల్లాలోని జెషోరేశ్వరి కాళీ దేవి ఆలయంలో జరిగిన ఈ చోరీ, భక్తులను షాక్‌కు గురి చేసింది. 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలయానికి కానుకగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం అక్కడి నుంచి అదృశ్యమైంది. ఈ చోరీ గురువారం మధ్యాహ్నం, పూజారి పూజలు ముగించి వెళ్లిన తర్వాత జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆలయ పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రపరిచే సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఈ విషయం బయటపడింది.

ఆ ఆలయ పూజల నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న కుటుంబ సభ్యుల్లో ఒకరైన జ్యోతి ఛటోపాధ్యాయ మాట్లాడుతూ, ఈ కిరీటం వెండితో తయారై, బంగారు పూత పూసి, దేవికి సమర్పించబడిందని వివరించారు. ఈ కిరీటానికి సాంస్కృతికంగా, మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని, దానిని కోల్పోవడం బాధాకరమని తెలిపారు.

2021లో బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ కిరీటాన్ని జెషోరేశ్వరి ఆలయానికి బహుమతిగా అందించారు. అప్పుడు ఆయన ఆలయంలో పూజలు నిర్వహించి, ఈ దేవాలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ హాల్ స్థానికులకు సామాజిక, మతపరమైన కార్యకలాపాలకు, విద్యా కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని, ముఖ్యంగా విపత్తుల సమయంలో సురక్షిత ఆశ్రయంగా నిలుస్తుందని మోదీ తెలిపారు.

జెషోరేశ్వరి ఆలయ ప్రాధాన్యత:
జెషోరేశ్వరి కాళీ దేవి ఆలయానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం, ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం 12వ శతాబ్దం చివర్లో బ్రాహ్మణుడు అనారి చేత నిర్మించబడినట్లు విశ్వసించబడుతోంది. ఆలయానికి 100 తలుపులు ఉండటం విశేషం. 13వ శతాబ్దంలో లక్ష్మణ్ సేన్ ఆలయాన్ని పునరుద్ధరించగా, 16వ శతాబ్దంలో రాజా ప్రతాపాదిత్య దీన్ని మరలా పునర్నిర్మించారు.

ఈ చోరీపై విచారణ ప్రారంభమవ్వగా, భక్తులు మరియు స్థానికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket. Read more about un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. A fedex driver is dead after he was ejected from his truck and killed during a fiery crash on an.