satyam sundaram 2024 movie

దర్శకుడు ప్రేమ్ కుమార్ ను అభినందిస్తున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు సత్యం సుందరం చిత్రం;

కార్తీ మరియు అరవింద్ స్వామి ముఖ్య పాత్రల్లో నటించిన సత్యం సుందరం చిత్రం, సర్వత్రా ఆదరణ పొందిన హోల్సమ్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా హీరోలు కేవలం నటించలేదని, వాళ్లు నిజంగా తమ పాత్రలను జీవించి, ప్రేక్షకులకు కుటుంబ సభ్యులుగా అనిపించారని చెప్పవచ్చు 96 వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, కుటుంబ బంధాలను విలువలతో అనుసంధానించి మృదువుగా కథను ముందుకు నడిపిస్తుంది. సూర్య మరియు జ్యోతిక 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన *సత్యం సుందరం, సెప్టెంబర్ 28న విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం, బావ-బావమరదుల మధ్య బంధాలను బలంగా చాటుతోంది, ఇది ప్రేక్షకుల కంట తెప్పించింది ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఆసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈ చిత్రాన్ని మరింత విస్తృతంగా ప్రసారం చేసింది.

తాజాగా, ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది, మరియు విడుదలైన క్షణం నుంచే ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ అందుకుంది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయని నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు కార్తీ సుందరం పాత్రను అద్భుతంగా ఆదర్శించారు ఆయన పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని అనిపించేలా నటించారు. సినిమా, మనిషి జీవితం డబ్బు సంపాదనలో కాకుండా, ప్రేమను పంచుకోవడంలో ఉందని తెలియజేస్తుంద దర్శకుడు ప్రేమ్ కుమార్, ఈ సందేశాన్ని మరింత బలంగా ప్రచారం చేసి, మనుషులతో బంధాలను దృష్టిలో పెట్టుకోవడం, నిజమైన విలువగా భావించాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రేమ, కుటుంబం, మరియు సామాజిక సంబంధాలు ఎలా మదించే విషయాలను చూపించడంలో చాలా సమర్థంగా ఉన్నారు మొత్తానికి, సత్యం సుందరం ఒక చిత్రంగా కాకుండా, మన జీవితాలు, మన కుటుంబాలు మరియు సంఘాన్ని పునఃపరిశీలించేందుకు ప్రేరణగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *