sriram krishnan

ట్రంప్ టీమ్ లోకి శ్రీరామ్ కృష్ణన్

జనవరి మాసంలో అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ తన మంత్రివర్గాన్ని విస్తరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో మరో ఇండియన్ అమెరికన్ కు చోటు దక్కింది. కృత్రిమ మేధకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త, టెకీ, రచయిత శ్రీరామ్ కృష్ణన్ ను ట్రంప్ నియమించారు.

ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృష్ణన్ సీనియర్ పాలసీ అడ్వైజర్ గా నియమించినట్లు తెలిపారు. వైట్‌హౌస్‌ ఏఐ క్రిప్టో జార్‌ డేవిడ్‌ ఒ శాక్స్‌తో కలిసి ఆయన పనిచేస్తారని అన్నారు.
విండోస్ అజుర్ వ్యవస్థాపక సభ్యుడిగా శ్రీరామ్
కృత్రిమ మేధతో అమెరికన్‌ నాయకత్వాన్ని మరింత ముందుకుతీసుకెళ్తారని ట్రంప్‌ వెల్లడించారు. విండోస్ అజుర్ వ్యవస్థాపక సభ్యుడిగా శ్రీరామ్ కృష్ణన్ మైక్రోసాఫ్ట్ లో తన కెరీర్ ను స్టార్ట్ చేశారని ట్రంప్ తెలిపారు. కాగా, దీనిపై ట్రంప్ కు శ్రీరామ్ కృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీరామ్ కృష్ణన్ చెన్నైకి చెందిన వారు.
చెన్నైలోనే పుట్టిపెరిగిన కృష్ణన్.. అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి అమెరికా వెళ్లారు. మైక్రోసాఫ్ట్ లో 2007 లో తన కెరీర్ ప్రారంభించి, ఫేస్‌బుక్‌, యాహూ, ట్విటర్‌, స్నాప్‌ తదితర సంస్థలలో పనిచేశారు. తన మేధస్సుతో ముందుకు దూసుకెళ్తున్న శ్రీరామ్ కృష్ణన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాడని ట్రంప్ అన్నారు.

Related Posts
సుప్రీం కోర్టు ఢిల్లీ వాయు కాలుష్యంపై ఆగ్రహం
supreme court india 2021

గత కొన్ని రోజులుగా ఢిల్లీ వాయు క్వాలిటీ సివియర్ ప్లస్ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, సుప్రీం కోర్టు నేడు ఢిల్లీ అధికారులు మరియు కాలుష్య నియంత్రణ Read more

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పొత్తులో Read more

క్రిస్మస్ వేడుకలలో ప్రపంచ దేశాల ఐక్యత..
christmas

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కావడంతో, ప్రపంచవ్యాప్తంగా పండుగ సీజన్ మరింత ఉత్సాహంగా మారింది. యేసుక్రీస్తు జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకునే ఈ రోజు, ఆనందం మరియు సద్భావనతో ప్రపంచవ్యాప్తంగా Read more

ఏపీలో వాలంటీర్లు వద్దే వద్దు – నిరుద్యోగ జేఏసీ
ap volunteer

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై నిరుద్యోగ జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను ఉపయోగించి Read more