priyanka

జమిలి జేపీసీలో ప్రియాంకాగాంధీ?

‘వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ కి చోటు కల్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా బిల్లును జేపీసీకి పంపినప్పుడు ఆ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసే జేపీసీలో ప్రతిపక్ష ఎంపీలకు కూడా చోటు కల్పిస్తారు.
తుదినిర్ణయం ప్రతిపక్ష పార్టీలదే
అయితే తమ పార్టీ తరఫున ఎవరిని జేపీసీలో సభ్యులుగా చేర్చాలనే విషయంలో ప్రతిపక్ష పార్టీలే తుది నిర్ణయం తీసుకుంటాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ.. ప్రియాంకాగాంధీ వాద్రాను వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లుపై ఏర్పాటు కాబోయే జేపీసీలో సభ్యురాలిగా చేరుస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రియాంకాగాంధీతోపాటు మనీష్‌ తివారి, సుఖ్‌దేవ్‌ భగత్‌, రణ్‌దీప్ సుర్జేవాలాకు కూడా జేపీసీలో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.

jamili nice

దేశమంతటా ఒకే దఫా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జన్‌రామ్‌ మేఘ్‌వాల్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సమగ్ర అధ్యయనం కోసం జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై లోక్‌సభ ఓటింగ్‌ నిర్వహించి జేపీసీకి పంపాలని నిర్ణయించారు. మూడోసారి బీజేపీ గెలవడంతో జమిలీపై పట్టుదలతో వుంది.

Related Posts
ఎన్నికలకు ముందు AAPపై ఒత్తిడి వ్యూహాలు
athishi 1

మంగళవారం తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో గోవింద్‌పురి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌ను అడ్డుకుని, దాడి చేసినందుకు అధికార ఆప్‌కు చెందిన ఇద్దరు సభ్యులు అష్మిత్, సాగర్ Read more

DEI వ్యతిరేక ప్రతిపాదనను తిరస్కరించిన ఆపిల్
DEI వ్యతిరేక ప్రతిపాదనను తిరస్కరించిన ఆపిల్

ఆపిల్ కంపెనీలో వైవిధ్యం, సమానత్వం, చేరిక (DEI - Diversity, Equity, Inclusion) కార్యక్రమాలను రద్దు చేయాలనే ప్రతిపాదనను వాటాదారులు తిరస్కరించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని Read more

కుంభమేళాలో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు: ప్రభుత్వం ప్రకటన
55 Crore People Bath in Kum

మానవ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమమన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల Read more

తీవ్ర వాయు కాలుష్యం..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక సూచనలు..
Severe air pollution.Key instructions of Union Health Ministry

న్యూఢిల్లీ: శీతాకాలం, పండుగలు సమీపిస్తున్నప్పుడు, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *