ఐశ్వర్య రాజేష్ తమ అందాలతో ఆకట్టుకుంటుంది.

ఐశ్వర్య రాజేష్ తమ అందాలతో ఆకట్టుకుంటుంది.

ఐశ్వర్య రాజేష్‌ ఈ పేరు సినీప్రేమికులకు కొత్త కాదు.దాదాపు 13 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది.చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ,ఇప్పుడు హీరోయిన్గా దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ, హిందీ చిత్రాల్లో కూడా మెరిసింది. అయితే, తమిళ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసిన సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో ఆఫర్లు తగ్గాయి.కానీ ఇప్పుడు ఐశ్వర్య కొత్త ఊపు తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

aishwarya rajesh
aishwarya rajesh

ఈ సినిమాపై ఐశ్వర్య పెద్ద ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే, అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్ ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకుంది. ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, స్క్రిప్ట్ నరేషన్ విన్నప్పుడే నవ్వులు ఆగలేకపోయాను. నా కెరీర్‌లో ఇంతగా ఎంజాయ్ చేస్తూ విన్న స్క్రిప్ట్ ఇదే.’భాగ్యం’ పాత్ర కోసం చాలా ఆలోచించారు.

Aishwarya Rajesh
Aishwarya Rajesh

ఆ పాత్ర నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది.ఈ సినిమా విజయవంతం అయితే, తెలుగు సినీ పరిశ్రమలో ఐశ్వర్యకు మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయం.గతంలో కంటే ఈసారి ఆమె పూర్తిగా కొత్త ఊహలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.ఐశ్వర్య నటన, వెంకటేశ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వం. ఈ మూడింటి కలయిక సంక్రాంతి బరిలో ఎంత దుమ్ము రేపుతుందో చూడాలి! తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. ఐశ్వర్యకు ఇది మైలురాయి కావాలని సినీప్రేమికులు ఆశిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే!

Related Posts
Namrata : మదర్స్ మిల్క్ బ్యాంక్ : జయవాడలో పర్యటించిన నమ్రత
Namrata మదర్స్ మిల్క్ బ్యాంక్ జయవాడలో పర్యటించిన నమ్రత

Namrata : విజయవాడలో పర్యటించిన నమ్రత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ నేడు విజయవాడ లో పర్యటించారు. ఆంధ్ర హాస్పిటల్స్ ప్రాంగణంలో Read more

Nayanthara;సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా ఉంది
nayanthara 1

సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం తన కుటుంబ జీవితంలో ఆనందకరమైన సమయాలను గడుపుతోంది. ఆమె ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో వివాహం చేసుకుని కవల పిల్లలకు Read more

మొత్తానికి ప్రియుడు గుట్టు విప్పిన సమంత
samantha 1

హీరోయిన్ సమంత జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆమె సినీ ప్రయాణం నుంచి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తుంటాయి. తెలుగులో Read more

మనీష్‌ మల్హోత్రా పార్టీలో మెరిసిన తారలు.. ప్రత్యేక ఆకర్షణగా శోభితా, జాన్వీ
janhvi kapoor

ఇంటర్నెట్ డెస్క్ ప్రతి పండగ సమయంలో బాలీవుడ్‌లో ప్రముఖుల పార్టీలు హైలైట్ అవుతుంటాయి స్టార్ నటీనటులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఒకే వేదికపై కలుసుకొని పండగ వేళ వేడుకలను Read more