Another shock for the volun

వాలంటీర్లకు మరో షాక్ – మొబైల్ యాప్‌లో హాజరు ఆప్షన్ తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లకు వరుస షాకులు తగ్గడం లేదు. వాలంటీర్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టుగా నిలిచి, కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చెయ్యడంతో.. ఇప్పుడు వాలంటీర్ల పట్ల కూటమి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది. వారిని వాలంటీర్లుగా కాకుండా.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం ఆ పని చెయ్యలేకపోయింది. దాంతో వాలంటీర్ల కెరీర్ గందరగోళంలో పడింది.

5 నెలలుగా ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ. 10 వేల జీతం పెంచాలని ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు మరో పెద్ద షాక్ తగిలింది. గ్రామ అవార్డు సచివాలయ శాఖకు సంబంధించిన మొబైల్ యాప్ లో వాలంటీర్లు హాజరు వేసుకునేటువంటి ఆప్షన్ను… తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఇకపై వాళ్లు హాజరు వేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. వారం కిందటి వరకు ఈ సదుపాయం ఉండగా…. మంత్రి వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థలో తాము లేమని ప్రకటించడంతో మొబైల్ యాప్ లో హాజరు వేసుకునే ఆప్షన్ ను తొలగించారట. దీంతో ఏపీ వాలంటీర్లు రోడ్డున పడినట్లు అయింది. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వమే రద్దు చేసిందని.. ఇటీవల ఏపీ శాసనమండలిలో మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు. అసలు వాలంటీర్ వ్యవస్థే ఏపీలో లేదన్న ఆయన.. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చెయ్యలేదని తెలిపారు. 2023 సెప్టెంబర్‌తోనే వాలంటీర్ వ్యవస్థకు గడువు కాలం ముగిసిందన్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించకపోవడం వల్ల.. అప్పటి నుంచి ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదన్నారు. అందుకే వాలంటీర్లకు జీతాలు ఇవ్వట్లేదు అన్నారు.

Related Posts
నేటి నుంచి కొమురవెల్లి జాతర
Komuravelli Mallanna Swamy

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైన కొమురవెల్లి మల్లన్న జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే ఈ జాతర ఉగాది ముందు వచ్చే Read more

ఆట స్థలం కబ్జా పై చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదు
1500x900 1079640 gandhibabji

ఆట స్థలం కబ్జా పై చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదువెలగపూడి : టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భూ సమస్యలతో Read more

కోహ్లీపై తేల్చి చెప్పిన రేవంత్.
కోహ్లీపై తేల్చి చెప్పిన రేవంత్.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల దావోస్ పర్యటనలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ పర్యటన ద్వారా ఆయన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను పరిచయం చేయడంతో Read more

శివపూజలో కార్తిక పౌర్ణమి ప్రత్యేకత:శివ లింగానికి పూజ చేసి పుణ్యం పొందండి
siva lingam 2

కార్తిక పౌర్ణమి రోజున శివారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు శివుని పూజ చేయడం ద్వారా శరీర, మనసు, ఆత్మ దుర్గములు, పాపాలు దూరమవుతాయి. కార్తిక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *