ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు

ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులవైపు దృష్టిని సారించింది. ఇందులో భాగంగా ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

 ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు


పూర్తి అయిన ఫీజిబిలిటీ సర్వే
శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఫీజిబిలిటీ సర్వే పూర్తయిందని, అక్కడ రెండు దశల్లో 1,383 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు రావడం వల్లంది లాభాలను చంద్రబాబు వివరించారు. ఇందుకోసం భూసేకరణ జరుపుతున్నట్టు తెలిపారు. దగదర్తిలో 1,379 ఎకరాల్లో నిర్మించనున్న విమానాశ్రయం కోసం ఇప్పటికే 635 ఎకరాలు సేకరించినట్టు పేర్కొన్నారు. అలాగే, నాగార్జునసాగర్‌లో 1,670, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్టు వివరించారు. ఒంగోలులో 657 ఎకరాలు, తుని-అన్నవరం మధ్య 757 ఎకరాలను గుర్తించినట్టు చంద్రబాబు తెలిపారు.

Also Read: రైతు భరోసా విధివిధానాలు ఖరారైనట్లేనా..?


ఆరు నెలల్లో కొత్త టెర్మినల్ భవన నిర్మాణాలు పూర్తి
గన్నవరం విమానాశ్రయంలో నిర్మించే టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో రూపొందించిన ఆకృతులతో నిర్మించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, దగదర్తి ప్రాంతంలో బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోందని, అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతున్నట్టు వివరించారు. శ్రీసిటీలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

Related Posts
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ కేటాయింపులు
Huge allocations for educat

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ మొత్తం 3.22 లక్షల కోట్లుగా Read more

కార్యకర్త తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపైనా, పార్టీపైనా పడుతుంది: సీఎం చంద్రబాబు
CM Chandrababu held meeting with TDP Representatives

మంగళగిరి: టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో Read more

బడ్జెట్ లో విద్యారంగంలో కీలక నిర్ణయాలు
బడ్జెట్ లో విద్యారంగంలో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను తీసుకురావాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంకల్పానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలను Read more

దోచుకున్న సొమ్ము బయటపెట్టు విజయసాయి – సోమిరెడ్డి
somireddy vijayasai

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి గతంలో చేసిన పనులు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *