Telangana Govt: గోదావరి జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు

గోదావరి నదీ జలాల్లో తమకు దక్కాల్సిన హక్కుల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధం కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం(Telangana Govt) ప్రాజెక్టు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను తాము అంగీకరించబోమని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో బలమైన న్యాయపోరాటం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సీనియర్ న్యాయ నిపుణులతో సమావేశమై, న్యాయ వ్యూహాలపై చర్చించారు. … Continue reading Telangana Govt: గోదావరి జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు