Karimnagar: ఎరువుల సరఫరాపై కలెక్టర్ కీలక ప్రకటన

కరీంనగర్(Karimnagar) జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 4,246 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయకుండా, సిఫారసు చేసిన మోతాదుల ప్రకారమే వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. అలా చేయడం వల్ల నిల్వలపై ఒత్తిడి … Continue reading Karimnagar: ఎరువుల సరఫరాపై కలెక్టర్ కీలక ప్రకటన