Latest News: Jaipal Nayak: బాండ్ పేపర్‌తో జైపాల్ వినూత్న ప్రచారం

సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాలో పంచాయతీ ఎన్నికల హడావుడి నడుమ, యువ అభ్యర్థి గుగులోతు జైపాల్ నాయక్(Jaipal Nayak) ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాధారణ రాజకీయ ప్రచారాలకతీతంగా, తన నిజాయితీని ప్రజల ముందు నిరూపించేందుకు అతను ఎన్నుకున్న మార్గం పూర్తిగా విభిన్నంగా నిలిచింది. జైపాల్ నాయక్ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైతే పదవిని ఉపయోగించి అక్రమంగా ఒక్క రూపాయి సంపాదించినా తన మొత్తం ఆస్తిని గ్రామ పంచాయతీకి అప్పగిస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చాడు. ఈ పత్రాన్ని ప్రతి … Continue reading Latest News: Jaipal Nayak: బాండ్ పేపర్‌తో జైపాల్ వినూత్న ప్రచారం