Viral Video: హార్దిక్ పాండ్యా, మురళీ కార్తిక్‌ మధ్య వాగ్వాదం?

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, రెండో టీ20కి ముందు మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ మురళీ కార్తిక్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ కిట్ ధరించి, చేతిలో బ్యాట్ పట్టుకుని వార్మప్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైదానంలో కామెంటరీ విధుల్లో ఉన్న మురళీ కార్తీక్ అక్కడికి రావడంతో ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మాటలు సాధారణంగా సాగలేదని.. ఏదో విషయంలో వాగ్వాదం జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. … Continue reading Viral Video: హార్దిక్ పాండ్యా, మురళీ కార్తిక్‌ మధ్య వాగ్వాదం?