Latest News: Lionel Messi: వంతారా జూ లో సందడి చేసిన మెస్సీ

గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పర్యటించిన తర్వాత, గుజరాత్‌లో ఉన్న అనంత్ అంబానీ స్థాపించిన ప్రతిష్ఠాత్మక వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం వంతారాను మెస్సీ (Lionel Messi) సందర్శించాడు. ఈ పర్యటన క్రీడాభిమానులతో పాటు ప్రకృతి ప్రేమికుల దృష్టిని కూడా ఆకర్షించింది.