Latest Telugu News: President: శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శబరిమ(Sabarimala)లకు వెళ్లారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ ఉదయం ఆమె హెలికాఫ్టర్‌లో పతనంతిట్ట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంపాకు వెళ్లారు. పంపాలో తన పాదాలను కడుక్కోవడం ద్వారా సాంప్రదాయ శుద్ధి ఆచారాన్ని పాటించారు. అనంతరం ఆమె గణపతి ఆలయంలో ఇరుముడిని సిద్ధం చేసుకుని, సన్నిధానంకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. Read … Continue reading Latest Telugu News: President: శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ద్రౌపది ముర్ము