Breaking News – Electricity Associations: ఏపీలో విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా

విజయవాడలో విద్యుత్ శాఖకు సంబంధించిన కీలక చర్చలు మంగళవారం ముగిశాయి. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలో విద్యుత్ సంస్థల CMDలు, విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతల మధ్య సమావేశం జరిగింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, వేతన సవరణలు, సర్వీసు రూల్స్, పదోన్నతుల వంటి అనేక అంశాలపై ఈ సమావేశంలో విస్తృత చర్చలు జరిగాయి. ఈ చర్చలు సుమారు మూడు గంటలపాటు కొనసాగి, కొంతవరకు ఒప్పందం సాధ్యమైందని సమాచారం. అయితే, కొన్ని ముఖ్యమైన డిమాండ్లపై నిర్ణయం తీసుకోలేకపోయారు. … Continue reading Breaking News – Electricity Associations: ఏపీలో విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా