Breaking News: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP) ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది.. జనవరి నెలకు సంబంధించిన పింఛన్‌ను ఈనెల 31వ తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం (AP) నిర్ణయించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే పింఛన్ చెల్లించేందుకు చర్యలు తీసుకుంది. సంబంధిత నగదును బ్యాంకుల నుంచి 30వ తేదీనే నిర్దేశించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విత్‌డ్రా చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు జిల్లా డీఆర్‌డీఏ పీడీలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. … Continue reading Breaking News: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ