Latest News: AP: డ్రైవర్ అతివేగంతోనే ప్రమాదం: క్షతగాత్రులు

(AP) అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ మధు అతివేగమే కారణమని క్షతగాత్రులు వెల్లడించారు. పొగమంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా, మలుపుల వద్ద వేగంగా వాహనం నడపడంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది మరణించారని వారు తెలిపారు. అయితే, ప్రమాదానికి ముందు బ్రేకులు పనిచేయడం లేదని మధు చెప్పాడని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని మరో డ్రైవర్ ప్రసాద్ వెల్లడించారు. Read … Continue reading Latest News: AP: డ్రైవర్ అతివేగంతోనే ప్రమాదం: క్షతగాత్రులు