AP: క్యాబినెట్ భేటీ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో ఈ నెల 24న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 24న నిర్వహించాల్సిన క్యాబినెట్ భేటీని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వాయిదా పడిన ఈ మంత్రివర్గ సమావేశం 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాకులో జరగనుంది. … Continue reading AP: క్యాబినెట్ భేటీ వాయిదా