Zuckerberg passes Bezos to become worlds second richest person

ప్రపంచ కుబేరుల జాబితా.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న జుకర్‌ బర్గ్‌

Zuckerberg passes Bezos to become world’s second-richest person
Zuckerberg passes Bezos to become world’s second-richest person

న్యూయార్క్‌ : మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. జెఫ్‌ బెజోస్‌ను దాటి తొలిసారిగా ఈ స్థానానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్ వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జుకర్‌బర్గ్‌ సంపద 206 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 205 బిలియన్‌ డాలర్లు. ఇక ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ 256 బిలియన్‌ డాలర్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. భారతీయ బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ 107 బిలియన్‌ డాలర్ల సంపదతో 14వ స్థానంలో ఉండగా.. 100 బిలియన్‌ డాలర్లతో గౌతమ్‌ అదానీ 17వ స్థానంలో ఉన్నారు.

ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించాయి. రెండో త్రైమాసికంలో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదవ్వడంతోపాటు ఏఐ చాట్‌బాట్‌లను మరింత శక్తివంతంగా మార్చేందుకు లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లను పెంచడంతో మెటా షేర్లు 23శాతం పెరిగాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో సంస్థ షేరు విలువ ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకి 582.77 డాలర్ల వద్ద ముగిసింది. ఏఐ రేసులో ముందంజలో నిలిచేందుకు డేటా సెంటర్‌లు, కంప్యూటింగ్‌ పవర్‌పై మెటా పెద్ద ఎత్తున డబ్బుల్ని వెచ్చిస్తోంది. తాజాగా ఓరియన్‌ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్‌ను కూడా పరిచయం చేసింది.

Related Posts
పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్
PepsiCo India Revolutionary Awards

వ్యవసాయ రంగానికి తోడ్పడుతున్న మహిళలను ప్రశంసించే విలక్షణమైన వేదిక రివల్యూషనరి అవార్డ్స్, పెప్సికో ఇండియా వారిచే ప్రారంభించబడింది. హైదరాబాద్‌: తెలంగాణ నుండి గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్ (SHG) Read more

అందరినీ అంబానీ గా చేసే గ్రహశకలం
అందరినీ అంబానీ గా చేసే గ్రహశకలం

16 సైకి గ్రహశకలం: ప్రతి ఒక్కరినీ బిలియనీర్‌గా మార్చగల నిధి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ గ్రహశకలం ఖనిజ సంపదలతో, ముఖ్యంగా బంగారం, ప్లాటినం, నికెల్, మరియు Read more

తెలంగాణ లోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్?
wine shops telangana

తెలంగాణలో మద్యం ప్రియులకు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే దీనిపై చర్యలు Read more

వ్యవసాయ ఆవిష్కరణలలో అగ్రగామిగా క్రిస్టల్ క్రాప్ ప్రొటక్షన్
Crystal Crop Protection is a pioneer in agricultural innovation

న్యూఢిల్లీ : క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, వ్యవసాయ ఆవిష్కరణలలో ఉంది. కొన్ని ఆసియా దేశాలలో విక్రయాల కోసం బేయర్ AG నుండి క్రియాశీల పదార్ధం Ethoxysulfuron Read more